మణికందన్, శ్రీ గౌరి ప్రియ జంటగా దర్శకుడు ప్రభు రామ్ వ్యాస్ రూపొందించిన తమిళ సినిమా లవర్ తెలుగులో ట్రూ లవర్ పేరుతో ఈనెల 10న రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో ఎస్ కేఎన్ తో కలిసి రిలీజ్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతి. ఇవాళ జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ లో ట్రూ లవర్ సినిమాతో పాటు ప్రభాస్ తో తాను చేస్తున్న రాజా సాబ్ గురించి అప్డేట్ ఇచ్చారు మారుతి.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ప్రేమలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎమోషనల్. అమ్మాయిలు బాధ తట్టుకుంటారేమో గానీ అబ్బాయిలు బాధ పడితే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. తన లవర్ ఎవరితో మాట్లాడినా ప్రేమికుడు తట్టుకోలేడు. ఎవరైనా తన లవర్ ను ట్రాప్ చేస్తాడేమో అని భయపడతాడు. అమ్మాయిల తప్పేం లేదు. వాళ్లు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఈ సినిమాలో పరిస్థితులు ప్రేమికుల మధ్య ఇబ్బందులు తెస్తాయి. ఎవరైనా అమ్మాయి తన లవర్ ను అర్థం చేసుకోవాలంటే ట్రూ లవర్ సినిమా చూడండి. ప్రభాస్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేలా రాజా సాబ్ ఉంటుంది. త్వరలో ఈ మూవీ అప్డేట్ ఇస్తాం. అన్నారు.