టాలీవుడ్ కు ఇన్స్ పైరింగ్ సక్సెస్ ఇచ్చింది హనుమాన్. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించారు. హనుమాన్ సినిమా చివరలో ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ఉంటుందని అనౌన్స్ చేశారు. అప్పుడే నెక్ట్ ఇయర్ రిలీజ్ అని కూడా స్లైడ్ వేశారు.
హనుమాన్ హ్యూజ్ సక్సెస్ నేపథ్యంలో జై హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా ఉంటుందని, ఈ పాత్రలో ఒక స్టార్ హీరో నటిస్తారని తెలిపారు.
అలాగే తేజ సజ్జ చేసిన క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందని, అయితే ఈ సీక్వెల్ లో తేజ సజ్జ హీరోగా ఉండరని ప్రశాంత్ వర్మ అన్నాడు. హనుమాన్ కు వంద రెట్ల భారీ బడ్జెట్ తో జై హనుమాన్ రూపొందిస్తామని ఆయన తెలిపాడు. ప్రశాంత్ వర్మ స్టేట్ మెంట్స్ తో జై హనుమాన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.