బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞను పరిచయం చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాను ప్రకటించారు ప్రశాంత్ వర్మ. సన్నబడిన మోక్షజ్ఞ ఈ పోస్టర్ లో అందంగా కనిపిస్తున్నారు. ఫారిన్ లొకేషన్ మోక్షజ్ఞ నడుస్తూ వెళ్తున్న పిక్ ను పోస్టర్ లో రివీల్ చేశారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్వీట్ చేస్తూ మోక్షజ్ఞను పరిచయం చేసే అవకాశం కల్పించిన బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు.
మోక్షజ్ఞను తన సినిమాటిక్ యూనివర్స్ లో ఆకట్టుకునేలా చూపిస్తున్నానని, ఇది మోక్షజ్ఞతో పాటు తమ టీమ్ కు గుర్తుండిపోయే సినిమా అవుతుందని ప్రశాంత్ వర్మ తన ట్వీట్ లో తెలియజేశారు. మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. మోక్షజ్ఞ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.