రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఈ నెల 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా హన్మకొండలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యకర్మంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ ను హైలైట్ చేస్తూ స్పీచ్ ఇచ్చారు.
చదవండి: వైరల్ అవుతున్న మహేశ్ కొత్త లుక్
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఒకే ఒక పేరు.. రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని ఎనర్జీ. రామ్ ని సెట్స్ లో చూసిననప్పుడు తనలో కసి కనిపిస్తుంటుంది. తను వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్. రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు, తీసే ముందు కథ చెప్తారా అని అడిగారు. మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను, చిన్న చిన్న తప్పులు ఎవైనా చేస్తుంటారు తీసే ముందు ఒకసారి చెప్పండని అన్నారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాల ఎమోషనల్ అయిపోయాను.’ అన్నారు.