ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ సంస్థతో మూడోసారి టీమప్ అవుతున్నారు. ఆయన సొంత ప్రొడక్షన్ కంపెనీ అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి మూడో సినిమా రూపొందించబోతున్నారు. వీరితో కలిసి నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ సినిమా బిగ్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ధనుష్, నాగార్జున, రశ్మిక మందన్న కీ రోల్స్ లో శేఖర్ కమ్ముల ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మూడో చిత్రానికి అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరన్నది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరోవైపు ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాకు ధారావి అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని స్లమ్ ఏరియా ధారావి నేపథ్యంతో మాఫియా కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.