రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ తనకెంతో నచ్చిందని అన్నారు దర్శకుడు శంకర్. రామ్ చరణ్ దగ్గర కంట్రోల్డ్ పవర్ ఉందని, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారీ బిగ్ డైరెక్టర్. కమల్ హాసన్ తో తను చేస్తున్న ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన శంకర్ ఆ వేడుకలో గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడాడు.
శంకర్ మాట్లాడుతూ – సినిమాను ప్రేమించే సపోర్ట్ చేసే తెలుగు ప్రేక్షకుల కోసం తాను ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాను. అది గేమ్ ఛేంజర్ తో జరగడం సంతోషంగా ఉంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. కంట్రోల్డ్ పవర్ ఉన్న స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ లో ఉన్న పవర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియదు. మరో పది హేను రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ పార్ట్ పూర్తి చేశాం. త్వరలోనే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.అని అన్నారు.