పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ. ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఓజీ సినిమా షూటింగ్ ను హోల్డ్ లో ఉంచాడు. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది. ఏపీ ఎన్నికల తర్వాత గానీ పవన్ కల్యాణ్ షూటింగ్ కు హాజరయ్యేలా లేడు.
మిగతా ఆర్టిస్టుల కాంబోలో ఆల్రెడీ షూటింగ్ చేసిన డైరెక్టర్ సుజీత్…పవన్ లేనిదే షూటింగ్ చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఓజీ వర్క్ ఆగిపోకుండా…ఇందులోని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాడట సుజీత్. ఓజీకి సీజీ వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి దొరికిన ఈ బ్రేక్ టైమ్ ను సీజీ వర్క్ కంప్లీట్ చేసేందుకు ఉపయోగిస్తున్నాడట. పవన్ లేకున్నా ఓజీ వర్క్ ఆగడం లేదు. ఇప్పటిదాకా చేసిన షూటింగ్ ఫుటేజ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయడం ద్వారా..రేపు పవన్ షూటింగ్ లో జాయిన్ కాగానే సినిమా పూర్తి చేయడం సులువు కానుంది.