రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఓ కొత్త పోస్టర్ తో ఈ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఇప్పటికీ టాకీ పార్ట్ కంప్లీట్ కాగా..ఇటీవల రెండు సాంగ్స్ షూట్ చేశారు. వాటిలో టైటిల్ సాంగ్ ఒకటి. మరొకటి డ్యూయెట్. దీంతో డబుల్ ఇస్మార్ట్ ఫినిష్ చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసి ఆగస్టు 15న రిలీజ్ కు తీసుకురానున్నారు. మరోవైపు మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఛార్మి, పూరి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.