సమంత చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వివాదం రేపుతోంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ హేల్ చేయమని సమంత ఈ పోస్ట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ పై డాక్టర్స్ మండిపడుతున్నారు. ఇది తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యకు దారి తీస్తుందని, ఇలాంటి సలహా సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇవ్వడం ప్రజలను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని కొందరు డాక్టర్స్ ట్వీట్స్ చేస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ లో వేసి పీల్చడం వల్ల ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గవని డాక్టర్స్ పేర్కొంటున్నారు.
ఇలాంటి ప్రమాదకర సలహా ఇచ్చిన సమంతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అవసరమైతే జైల్లో వేయాలని డాక్టర్స్ పోస్ట్ లు చేస్తున్నారు. తన పోస్ట్ వివాదాస్పదం కావడంతో సమంత స్పందించింది. తనకు తెలిసిన ఓ సీనియర్ వైద్యుడు చెప్పిన ప్రకారమే తాను హైడ్రోజన్ పెరాక్సైడ్ పీలుస్తున్నానని, ఇది వ్యాపార ప్రకటన కాదని సమంత సమాధానం ఇచ్చింది. సెలబ్రిటీగా అనవసర విమర్శలు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని అంది.