ఈ వయసులో మూడోపెళ్లా..?

Spread the love

ఈ వయసులో మూడోపెళ్లా..?
నా వల్లకాదన్న అమీర్‌ఖాన్‌..!

సరికొత్త కథలు, విభిన్న పాత్రలతో తనకంటూ బాలీవుడ్‌లో గుర్తింపుతెచ్చుకుని ఇటు దక్షినాదిలో కూడా తనదైన ముద్రవేసిన అమీర్‌ఖాన్‌.. వైవాహిక జీవితం గురించి తన మనసులోని మాట బయటపెట్టారు. నటి రియా చక్రవర్తి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన..తన మాజీ భార్యలు రీనా, కిరణ్‌రావుతో ఇప్పటికీ మంచి అనుబంధమే ఉందని తెలిపారు. వివాహ జీవితంలో రెండుసార్లు ఫెయిల్‌ అయిన తన వద్దనుంచి వైవాహిక సూచనలు తీసుకోకపోవడమే బెటరని అన్నారు. ఇదిలాఉంటే… మీకు మరో పెళ్లి ఆలోచన ఉందా అని సదరు హోస్ట్ రియా చక్రవర్తి ప్రశ్నించగా…ఈ వయసులోనా..! 59 ఏళ్లు వచ్చేశాయ్‌…ఈ వయసులో మూడో పెళ్లి అంటే కష్టం…పైగా ఎన్నో బాధ్యతలు ఉన్నాయంటూ అమీర్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు.

చదవండి: నటి నమితకు చేదు అనుభవం

క్రిస్మస్‌కు అమీర్‌ రాక..!

అమీర్‌ఖాన్ నటించిన ‘తారే జమీన్ పర్‌’ని సినీ ప్రేక్షకలోకం అంత తేలిగ్గా మరిచిపోలేదు. దీనికి సీక్వెల్‌గానే ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తెరకెక్కించారట. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్‌ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అమీర్‌ఖాన్‌తోపాటు 11 మంది పిల్లలు కనిపిస్తారట. హీరోయిన్‌గా జెనీలియా చేసింది. పారా ఒలింపిక్స్ నేపథ్యంలో కథ సాగుతుందనేది ముంబై టాక్. కాగా తన మాజీ భార్య కిరణ్‌రావుతో కలిసి ఈ చిత్రాన్ని అమీర్‌ఖానే నిర్మించడం మరో విశేషం. సితారే జమీన్ పర్‌ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని…ఈ క్రిస్మస్‌కు రాబోతుందని చిత్రయూనిట్ అంటోంది.

Hot this week

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

Topics

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...