రవితేజ హీరోగా నటిస్తున్న ఈగిల్ మూవీ ఈ నెల 9న రిలీజ్ కు రెడీ అవుతోంది. సంక్రాంతికి రిలీజ్ ఆపుకున్నాం అని చెప్పి ఈ ఫ్రైడేకు సోలో రిలీజ్ కోసం పట్టుబడ్డారు. అనుకున్నట్లే ఒక్క రజినీకాంత్ డబ్బింగ్ మూవీ లాల్ సలామ్ తప్ప ఆ రోజు మరే తెలుగు సినిమా రిలీజ్ కావడం లేదు. ఒకరోజు ముందు యాత్ర2, ఒక రోజు తర్వాత ట్రూలవర్ అనే మూవీ రిలీజ్ కు వస్తున్నాయి. అయితే సోలో డేట్ కావాలని పట్టుబట్టి ఫిలింఛాంబర్ నుంచి తెచ్చుకున్న రవితేజ ఈగిల్..ఈ ఛాన్స్ ను ఎంత యూజ్ చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ మొదలవగా..పెద్దగా బుకింగ్స్ జరగడం లేదని తెలుస్తోంది. ఈగిల్ మీద అసలు హైపే లేకపోవడం ఇందుకు కారణం. రవితేజ రీసెంట్ మూవీస్ లో అస్సలు బజ్ లేని సినిమా ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఈ రెండు రోజుల్లో గట్టిగా ఏదైనా ప్రచారం చేస్తేనే సినిమా ఆడియెన్స్ కు తెలుస్తుంది. ఫస్ట్ షో టాక్ ను బట్టే ఈగిల్ ఫేట్ డిసైడ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించాడు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు.