మహేశ్ బాబు మురారి సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. గత వారం రిలీజైన సినిమాలకు గట్టిపోటీ ఇస్తోంది మురారి. మహేశ్ బాబు పుట్టినరోజు రిలీజైన ఈ సినిమాను అభిమానులు సెలబ్రేట్ చేస్తున్నారు. థియేటర్స్ లో పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు.
చదవండి: స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి – డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ వీడియోలను దర్శకుడు కృష్ణవంశీకి ట్యాగ్ చేసి ఆశీర్వదించండి అంటు పోస్ట్ లు చేస్తున్నారు. దీనిపై స్పందించారు దర్శకుడు కృష్ణవంశీ. పెళ్లికి మన సంప్రదాయంలో గొప్ప విలువ ఉందని, ఆ విలువలను, సంప్రదాయాలను పాడు చేయకండి అంటూ కోరారు.