సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాను రూపొందిస్తున్నారు. మార్చి 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆగస్టు 15కు పోస్ట్ పోన్ అయ్యింది. ఈ డేట్ మిస్ కావొద్దని మూవీ టీమ్ గట్టిగా వర్క్ చేస్తున్నారు. కంటిన్యూ షెడ్యూల్స్ లో సినిమాను ఫినిష్ చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో టైటిల్ సాంగ్ పిక్చరైజేషన్ చేస్తున్నారు. ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో పాటు మరో రెండు సాంగ్స్ కంప్లీట్ చేయాల్సిఉంది. డబుల్ ఇస్మార్ట్ లో కావ్యథాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా…సంజయ్ దత్ మరో కీ రోల్ చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ హిట్ అటు రామ్ కు, ఇటు పూరికి కీలకం కానుంది.