పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్స్ ఎలా ఉంటాయో ఫ్లాప్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. సెహ్వాగ్ లా కొడితే డబుల్ సెంచరీ లేకుంటే డక్ అవుట్. ఇదే పూరి స్టైల్. డబుల్ ఇస్మార్ట్ టోటల్ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న నిర్మాత నిరంజన్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఊడ్చిపెట్టుకుపోయాయి. 60 కోట్లకు ఆయన ఈ హక్కులు తీసుకుంటే 20 వెనక్కి వచ్చాయి. మిగతావి వదులేసుకోవాల్సిందేనని డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ దగ్గర పరిస్థితి చెబుతోంది.
హనుమాన్ సినిమాతో ఈ ప్రొడ్యూసర్ రికార్డ్ స్థాయిలో ఆదాయం పొందారు. పెట్టుబడికి ఎన్నో రెట్ల లాభం వచ్చింది. అందులో వచ్చిన లాభంలో కొంత ఇటీవల డార్లింగ్ సినిమాతో పోయింది. దాదాపు 12 కోట్లు ఆ మూవీలో లాస్ వచ్చింది. ఇక డబుల్ ఇస్మార్ట్ కొనుగోలుతో మేజర్ పార్ట్ పెట్టుబడి పోయింది.
చదవండి: 30ఏళ్లల్లో ఇలాంటి కేసు చూడలేదన్న జడ్జి..!
సినిమా ప్రొడక్షన్ ఒక బిగ్ గ్యాంబ్లల్ అని అందుకే అంటారు. ఇక్కడ స్థిరంగా డబ్బులు సంపాదించుకునే నిర్మాత ఎవరూ ఉండరు. ఎప్పుడూ ఇండస్ట్రీలో 90శాతం కొత్త ప్రొడ్యూసర్ ఉండటానికి కారణం ఇలా అనూహ్యమైన నష్టాలు రావడమే. వ్యాపార మెళకువలు, కుటుంబ నేపథ్యం, పరిచయాలు, ఫ్యామిలీ హీరోలు ఉన్న కొందరు ప్రొడ్యూసర్స్ మాత్రమే ఏళ్లకేళ్లు టాలీవుడ్ లో ఉండగలుగుతున్నారు.