రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. సంజయ్ దత్ ఓ కీ రోల్ చేస్తున్నాడు. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ స్టెప్పామార్ రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించాడు.
స్టెప్పామార్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, సాహితీ పాడారు. ఈ పాట డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ లా రూపొందించారు. రామ్ ఈ పాటలో ఎనర్జిటిక్ స్టెప్స్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ లో పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో మణిశర్మ అలాంటి ఛాట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడో లేదో మిగతా పాటలు రిలీజ్ అయితే తెలుస్తోంది.ased