రామ్ హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు మణిశర్మతో దర్శకుడు పూరి జగన్నాథ్ సాంగ్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ స్టూడియోలో పూరి డిస్కషన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ కు ప్రీక్వెల్ ఇస్మార్ట్ శంకర్ లో మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ లో మణి ట్యూన్స్ కీ రోల్ ప్లే చేశాయి.
ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లోనూ ఛాట్ బస్టర్ ట్యూన్స్ ఓకే అయినట్లు టీమ్ చెబుతోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను మార్చి 8న రిలీజ్ చేస్తామంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఆ డేట్ కు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. టీమ్ మాత్రం మూవీ వర్క్స్ చేసుకుంటూ వెళ్తోంది. పూరి, ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.