ఓటీటీలోకి వచ్చేసిన “డబుల్ ఇస్మార్ట్”

Spread the love

థియేట్రికల్ రిలీజ్ ముందు హడావుడి చేసిన డబుల్ ఇస్మార్ట్…డిజిటల్ ప్రీమియర్ కు మాత్రం చడీ చప్పుడు లేకుండా వచ్చేసింది. సైలెంట్ గా ఓటీటీ ప్రీమియర్ కు సిద్ధమైంది. డబుల్ ఇస్మార్ట్ ఈ రోజు నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో ఫ్లాప్ రిజల్ట్ తెచ్చుకుని బయ్యర్లు ముంచేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు పబ్లిసిటీ ఎందుకని మేకర్స్ భావించినట్లు ఉన్నారు. అందుకే అనౌన్స్ మెంట్ లేకుండా డైరెక్ట్ గా సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.

చదవండి: “దేవర” కొత్త పాట హిట్టా, ఫట్టా ?

ఇవాళ్టి నుంచి ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో స్ట్రీమింగ్ అ‌వుతోంది. గత నెల 15న పాన్ ఇండియా రిలీజ్ కు వచ్చింది డబుల్ ఇస్మార్ట్. డబుల్ ఇస్మార్ట్ సినిమాను గత సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందించారు దర్శకుడు పూరి జగన్నాథ్. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ బిగ్ బుల్ సంజయ్ దత్ విలన్ రోల్ చేశారు. బుర్రలో చిప్ మార్పిడి అంశాన్ని మరోసారి స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు పూరి. అయితే ఇది ఇప్పటికే చూసిన పాయింట్ కాబట్టి ప్రేక్షకులు పెద్దగా సినిమాకు కనెక్ట్ కాలేదు. పైగా అలీ కామెడీ ట్రాక్ పెద్ద బ్యాడ్ అయ్యింది.

దీంతో డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాతో దర్శకుడు పూరి మరోసారి విమర్శల పాలయ్యాడు. లైగర్ తర్వాత కాస్తో కూస్తో ఉన్న పూరి ఇమేజ్ డబుల్ ఇస్మార్ట్ తో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. డబుల్ ఇస్మార్ట్ ఆల్ థియేట్రికల్ రైట్స్ కొన్న హనుమాన్ నిర్మాత కె నిరంజన్ రెడ్డికి దాదాపు 40 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....