మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రైట్ తెలుగు మూవీ అనౌన్స్ చేశారు. ‘ఆకాశంలో ఒక తార’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రైతుగా కనిపించున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దర్శకుడు పవన్ సాధినేని రూపొందిస్తున్నారు. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
చదవండి: “మెకానిక్ రాకీ” గ్లింప్స్ ఎలా ఉందంటే?
‘ఆకాశంలో ఒక తార’గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండటాన్ని చూడొచ్చు. దుల్కర్ మరో డిఫరెంట్ రోల్‌తో వస్తున్నారనే విషయం పోస్టర్ ద్వారా స్పష్టమైంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాలతో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యానర్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.