సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ, క్రేజీ మూవీ వెట్టయన్. ఇందులో రజినీతో పాటు అమితాబ్ నటిస్తుండడం విశేషం. ఈ మూవీకి టీజే జ్ఞానవేల్ డైరెక్టర్. ఇక సూర్య నటిస్తోన్న భారీ చిత్రం కంగువ. ఈ మూవీని శివ తెరకెక్కిస్తున్నాడు. కంగువ అక్టోబర్ 10న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు రజినీకాంత్ వెట్టయన్ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి సూర్యకు షాక్ ఇచ్చారు. నిజంగానే రెండు సినిమాలు పోటీపడతాయా..? ఏ సినిమా అయినా తప్పుకుంటుందా..? అసలు ఏమైంది..?
అక్టోబర్ 10న ఎన్టీఆర్ దేవర రిలీజ్ కావాలి కానీ.. సెప్టెంబర్ 27న పవర్ స్టార్ ఓజీ రావడం లేదని తెలియడంతో దేవర మూవీ సెప్టెంబర్ 27న రావాలని ఫిక్స్ అయ్యింది. ఇక అక్టోబర్ 10న సూర్య కంగువ రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. కంగువ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ కి రెండు నెలలు టైమ్ ఉన్నప్పటికీ ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే.. కంగువ పార్ట్ 1 కు పోటీపడినా.. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కు ఎవరూ పోటీకి రారని నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ చేయడం.. ఆ కామెంట్స్ వైరల్ అవ్వడం జరిగింది.
కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా కామెంట్స్ నచ్చలేదో.. మరో కారణం ఏదైనా ఉందో ఏమో కానీ.. కంగువ పార్ట్ 2 వరకు ఎందుకు పార్ట్ 1తోనే చూసుకుందాం అన్నట్టుగా పోటీకి సై అంటూ రజినీ వెట్టాయన్ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా కంగువ టీమ్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ అనే చెప్పచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే పెద్దగా సమస్య ఉండదు కానీ.. తమిళనాడులో మాత్రం ఈ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే.. ఇబ్బందే. ఈ రెండు సినిమాలకు థియేటర్స్ సర్ధుబాటు చేయడం పెద్ద సమస్య అవుతుంది. ఇలా సూర్య కంగువతో పోటీకి రజినీ వెట్టయన్ మూవీ సై అనడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరిలో ఎవరైనా డేట్ మార్చుకుంటారో లేక తగ్గదేలే అంటూ పోటీకి సై అంటారో చూడాలి మరి.. ఏం జరగనుందో..?