రవితేజ హీరోగా నటించిన ఈగిల్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాల రష్ ఎక్కువగా ఉన్నందున పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా ఫిల్మ్ ఛాంబర్ రిక్వెస్ట్ చేసింది. వారి రిక్వెస్ట్ మేరకు ఈగిల్ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీకి విడుదల వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 9వ తేదీన కూడా లాల్ సలామ్, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.
దీంతో ఫిల్మ్ ఛాంబర్ గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈగిల్ ప్రొడ్యూసర్స్ లెటర్ రాశారు. సంక్రాంతి రిలీజ్ సందర్భంగా తమ సినిమాకు సోలో డేట్ ఇస్తామని అన్నారని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని ఆ లెటర్ లో కోరారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ చర్చిస్తోంది. రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈగిల్ సినిమాను నిర్మించింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.