నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా నుంచి ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ ను ఇవాళ రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ చేయాల్సిన ఈ గ్లింప్స్..టెక్నికల్ డిలేస్ వల్ల ఇవాళ విడుదలైంది. చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ అధికారులకు చిక్కిన 22 మంది భారతీయ మత్స్యకారుల కథతో తండేల్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. వాస్తవ ఘటనలు ఈ కథకు ఇన్సిపిరేషన్ గా తెలుస్తోంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తోంది. ఎస్సెన్స్ ఆఫ్ తండేల్ ఎలా ఉందో చూస్తే..
నాగ చైతన్య రాజు క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేశారు. చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గే 22 మంది భారతీయ మత్స్యకారుల ధైర్యసాహసాలు ఈ గ్లింప్స్ లో కనిపించాయి. రాజు దేశభక్తి, తోటి వారిని కాపాడాలనుకునే సాహసం, ప్రేయసి సత్యను మిస్ అయిన బాధ..వంటి అంశాన్నీ ఈ గ్లింప్స్ లో ఉన్నాయి. తండేల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా స్టార్టయ్యింది. అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.