థియేటర్స్ లో స్టార్ హీరోలు నరుక్కొస్తుంటే..ఓటీటీల్లో ఇతర భాషల నటులు జోరు చూపిస్తున్నారు. ఓటీటీల్లో క్రేజ్ ఉన్న ఇలాంటి హీరోల్లో ఒకరు ఫహాద్ ఫాజిల్. అతని కొత్త సినిమా ధూమమ్ ఆహాలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మించింది.
యూ టర్న్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ పవన్ కుమార్ థ్రిల్లర్ కథతో రూపొందించారు. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ధూమమ్ టీమ్ ఓటీటీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తోంది. పుష్ప లో విలన్ గా నటించాక ఫహాద్ ఫాజిల్ సినిమాలకు తెలుగు ఓటీటీల్లో క్రేజ్ ఏర్పడింది.