గుంటూరు కారం సినిమాపై ఫేక్ ప్రచారం జరుపుతున్న బుక్ మై షో టికెట్ బుకింగ్ యాప్ పై చిత్ర నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో యాప్ లో కొందరు కావాలని గుంటూరు కారం సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు గుర్తించారు. ఈ విషయాన్ని సినిమా పెద్దల దృష్టికి తీసుకొచ్చారు చిత్రబృందం. కేసు నమోదు చేయాల్సిందిగా వారు సూచించిన మీదట పోలీసులను ఆశ్రయించారు.
గుంటూరు కారం సినిమా బాగా లేదుంటూ బుక్ మై షో వేదికగా దుష్ప్రచారం జరుగుతోంది. దాదాపు వేలాది అక్కౌంట్స్ నుంచి ఈ ఫేక్ ప్రచారం జరుపుతున్నట్లు గుర్తించారు. ఇది సినిమా రెవెన్యూ మీద ప్రభావం చూపుతోందని నిర్మాతలు అంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాను రూపొందించారు.