విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ హీరోను ఒక మిడిల్ క్లాస్ భర్తగా, ఎన్నో బాధ్యతలు ఉన్న ఫ్యామిలీమ్యాన్ గా చూపించారు. అయితే ఆ ఫ్యామిలీ మ్యాన్ కు ఒక గతం ఉంటుంది. ఆ గతంలో తనో హ్యాండ్సమ్ టీనేజర్, యంగ్ రొమాంటిక్ పర్సన్, ప్రేమించిన అమ్మాయి సిగ్గు పడుతుంటే వెంటపడి వెళ్లే లవర్. ఫ్యామిలీ స్టార్ లో హీరో విజయ్ కూడా ఇలాగే తన గతంలో ఒక మోస్ట్ ఎలిజిబుల్ లవర్. ఆ లవర్ ఎలా ఉంటాడో సాంగ్ ప్రోమోలో రివీల్ చేశారు మేకర్స్.
నందనందనా అనే ఈ పాట ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఇందులో మృణాల్ కాలేజ్ కు వెళ్తుంటే..ఆమె వెంట విజయ్ కూడా వెళ్తున్నాడు. నందనందనా పాట వీళ్లిద్దరి ప్రేమ మొదలైన సందర్భంలోనిది అనుకోవచ్చు. వాళ్ల ప్రేమను ఈ పాట ఎలా వ్యక్తపరిచిందీ అనేది ఫుల్ సాంగ్ రిలీజయ్యే ఈ నెల 7వ తేదీన తెలుస్తుంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. గోపీ సుందర్ ట్యూన్ చేశారు. ఈ పాట ఛాట్ బస్టర్ అయ్యేలా ఉంది.