ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ వాయిదా పడిందని, ఆ డేట్ స్లాట్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు వస్తుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కావాల్సింది…అయితే ఇంకా వర్క్ మిగిలే ఉన్నందున వాయిదా వేశారు. ఇది అఫీషియల్ గా వెల్లడించలేదు. అయితే విజయ్ ఫ్యామిలీ స్టార్ డేట్ ను ఏప్రిల్ 5గా డిసైడ్ చేస్తూ ఇవాళ మేకర్స్ అనౌన్స్ మెంట్ చేశారు.
ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో విజయ్ ఓ సగటు భర్తలా, కుటుంబాన్ని పోషించే బాధ్యతలు గల తండ్రిగా కనిపిస్తున్నారు. ఇంటి పనుల కోసం ఆయన గన్నీ బ్యాగ్ తో లుంగీ గెటప్ లో ఆధార్ కార్డ్ తో సహా బయటకు వెళ్తున్నట్లు పోస్టర్ లో చూపించారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.