విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా..డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. ఈ సినిమాను ఈ సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నా…హడావుడిగా విడుదల ఎందుకని మార్చికి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చి 22న ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. మార్చి 8న రామ్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. మార్చి 22 మంచి డేట్ అని ఫ్యామిలీ స్టార్ టీమ్ భావిస్తోంది. విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా మీద మంచి క్రేజ్ ఏర్పడుతోంది.