కేజీఎఫ్ తర్వాత అన్బరివ్ పేర్లు దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాయి. ఇప్పుడీ ఫైట్ మాస్టర్స్ డైరెక్టర్స్ కాబోతున్నారు. కమల్ హాసన్ నటించనున్న 237వ సినిమాకు డైరెక్టర్స్ గా అన్బరివ్ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అనౌన్స్ చేసింది.
కమల్ హాసన్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ యాక్షనర్ ‘థగ్ లైఫ్’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కేహెచ్237 ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ స్పందిస్తూ- ‘ఇద్దరు ప్రతిభావంతులు నా సినిమాతో దర్శకులుగా మారడం సంతోషంగా ఉంది. మా ప్రాజెక్ట్ లోకి అన్బరివ్ ను వెల్ కమ్ చేస్తున్నాం.’ అని ట్వీట్ చేశారు.