హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలో దీపిక, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వయాకామ్ స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫైటర్ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నారు. ఫైటర్ సినిమా ఈ నెల 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫైటర్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాలు, దేశం కోసం చేసే పోరాటాలు, త్యాగాలతో ఫైటర్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ట్రైలర్ లో ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ పైలట్స్ గా హృతిక్, దీపిక…వారి పై అధికారిగా అనిల్ కపూర్ కనిపించారు. ఉగ్రవాదులు మన వాయుసేనపై దొంగ దొబ్బ తీయడం, ఆ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన వాయుసేన దాడులు చేయడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఫైటర్ లో ఫైటర్ జెట్స్ తో చేసిన విన్యాసాలు హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీల్ కలిగించాయి.