పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అదే.. రీ రిలీజ్. పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో రీ రిలీజ్ అంటూ స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రెండ్ ముగిసింది అనుకుంటుంటే.. మురారితో మళ్లీ ఊపొచ్చింది. ఈ మూవీ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి.. మహేష్ మురారి రీ రిలీజ్ రికార్డ్ ను పవన్ గబ్బర్ సింగ్ క్రాస్ చేసేనా..?
స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. కొంత మంది అయితే.. సంవత్సరానికి ఒకటి కూడా రావడం లేదు. మరి కొంత మంది అయితే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే.. సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న హీరోల అభిమానులకు రీ రిలీజ్ అనేది ఆనందాన్ని ఇస్తుంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజున మురారి సినిమాను రీ రిలీజ్ చేస్తే.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 5.4 కోట్లు కలెక్ట్ చేయగా, మొత్తంగా 9 కోట్లు కలెక్ట్ చేసి రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.
చదవండి: బన్నీ, క్రిష్ కాంబో కుదిరినట్లే
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఇంద్ర. బి.గోపాల్ తెరకెక్కించిన ఇంద్ర మూవీని చిరు పుట్టినరోజున రీ రిలీజ్ చేశారు. 385 థియేటర్స్ లో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేశారు. చిరు అభిమానులతో ఇంద్ర థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. అలాగే అశ్వనీదత్, బి.గోపాల్, సోనాలి బింద్రే కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇంద్ర రీ రిలీజ్ కు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. దీంతో మురారి రీ రిలీజ్ రికార్డ్ ను ఇంద్ర క్రాస్ చేస్తుందనే టాక్ వినిపించింది కానీ.. 3.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో మురారి రికార్డ్ ను టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా 5 రోజులు ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్స్ లో ఇలా టికెట్స్ పెట్టిన వెంటనే సేల్ అయిపోయాయి. దీనితో మరోసారి గబ్బర్ సింగ్ మేనియా మొదలైంది. మరి.. మురారి రీ రిలీజ్ రికార్డ్ ను గబ్బర్ సింగ్ క్రాస్ చేస్తుందేమో చూడాలి.