సినిమా హీరోలు, అందులోనూ అగ్రతాంబూలం అందుకుంటున్న స్టార్లు, అశేష ప్రజాభిమానం గల కథనాయకుల బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఈ మధ్య కాలంలో థియేటర్లలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు.. నాడు మాంచి హిట్‌కొట్టి ప్రస్తుతం మూలనున్న ఆ రీల్స్‌కు దుమ్ముదులిపి రీ రిలీజ్ పేరుతో మళ్లీ ప్రేక్షకులకు నయనానందాన్ని కలిగిస్తున్నారు. మొన్నటికి మొన్న మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలతో ఫ్యాన్స్ ఫిదా అయిపోగా, చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’సేనుడంటూ మళ్లీ థియేటర్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు సదరు మూవీ టీమ్. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా గబ్బర్‌సింగ్ రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారట. ఇంకేముంది ఆరోజంతా థియేటర్లలో జాతరే, ఆపై పూనకాలు లోడింగ్ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయారట.
చదవండి: రేవంత్‌కు ‘కమలం’ మద్దతు..? హైడ్రా నిర్ణయం మంచిదేనన్న BJP MP..!
మంగళవారం ట్రైలర్ రీ రిలీజ్..?
ఏపీ డిప్యూటీసీఎం, మంత్రి పవన్‌కల్యాణ్…మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రారంభం మొదలు నేటివరకు స్క్రీన్‌పై కనపడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజుని పురస్కరించుకని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇవ్వాలని, అందుకుగానూ గబ్బర్‌సింగ్ రీ రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించిన నేపథ్యంలో…ముందుగా ఆ మూవీ ట్రైలర్‌ను కూడా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ క్రమంలో మంగళవారం డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతులుమీదుగా ట్రైలర్ రీ రిలీజ్ చేస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి.