ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గం గం గణేశా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ప్రైమ్ వీడియోలో నేటి నుంచి గం గం గణేశా స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 31న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. దురాశ, కుట్ర, భయం అనే మూడు హుక్ పాయింట్స్ తో క్రైమ్ కామెడీ మూవీగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఉదయ్ శెట్టి.
ఈ చిత్రాన్ని హైలైఎఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించారు. క్రైమ్ కామెడీ కథతో దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించారు. నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్ గా నటించారు. ఆనంద్ దేవరకొండను కొత్తగా చూపించిన సినిమాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వినాయక విగ్రహంలో డబ్బు, వజ్రం కోసం హీరో, విలన్స్ ఎలా ప్రయత్నాలు చేశారు, తిరిగి తమ డబ్బు, వజ్రాన్ని సాధించుకున్నారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ.