రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా జూలై 31న కియారా అద్వానీ పుట్టినరోజు ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ఆమె లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
చదవండి: “బడ్డీ” పిల్లల్ని, పెద్దల్ని ఎంటర్ టైన్ చేస్తుంది
కియారా గ్లామర్ లుక్ కట్టిపడేస్తోంది. వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజర్‌లో అలరించటానికి రెడీ అయ్యారు. రీసెంట్‌గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసేశారు. డైరెక్టర్ శంకర్ మిగిలిన చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను రూపొందిస్తున్నారు.