పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆ రోజు అభిమానులకు పండగ రోజు. ప్రతి సంవత్సరం పవన్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే.. ఈసారి ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండడంతో సెలబ్రేషన్స్ చాలా గ్రాంగ్ గా చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అలాగే సెప్టెంబర్ 2న మరోసారి థియేటర్స్ లోకి వస్తోన్న గబ్బర్ సింగ్ మూవీకి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ నటిస్తోన్న ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని సమాచారం.
చదవండి: సజ్జల పరువునష్టం దావా..
ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. యూట్యూబ్ షేక్ అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని తెలియడంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా అప్ డేట్ ఉంటుందని నిర్మాత రవిశంకర్ తెలియచేశారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన షూట్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసాం. తమ దగ్గర ఉన్న కంటెంట్ నుంచి ఖచ్చితంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఉంటుందని నిర్మాత చెప్పడంతో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తారా..? గ్లింప్స్ రిలీజ్ చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది.
మరో వైపు హరి హర వీరమల్లు నుంచి కూడా అప్ డేట్ రానుందని తెలుస్తోంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 2న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, వీరమల్లు నుంచి అప్ డేట్స్ వస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే.