హీరో గోపీచంద్ తో దర్శకుడు శ్రీనువైట్ల ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ తమ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ గా నిర్మిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఇటలీలో ఓ షెడ్యూల్ షూటింగ్ జరిపి రెండో షెడ్యూలో గోవాలో కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం మూవీ టీమ్ హిమాలయాలకు వెళ్లారు.
హిమాలయాల ప్రాంతంలో ఓ లెంగ్తీ షెడ్యూల్ జరుపుతున్నారు. ఈ సినిమాకు ప్రారంభంలోనే బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయి. అనుకున్న దానికంటే దర్శకుడు శ్రీనువైట్ల ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నాడని నిర్మాతలు డిస్కషన్స్ చేశారని, ఓ టైమ్ లో షూటింగ్ ఆపే వరకు ఇష్యూ వెళ్లిందని టాక్ వినిపించింది. అయితే కొత్త బిజినెస్ పార్టనర్స్ ను యాడ్ చేసుకుని గోపీచంద్ సినిమా షూటింగ్ కంటిన్యూ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా సెలెక్ట్ చేయలేదు.