సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను మేకర్స్ వెల్లడించారు. గుంటూరు కారం మొదటి వారం రోజుల్లో 212 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఇది ఒక రీజనల్ మూవీకి ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా క్రెడిట్ ఇచ్చుకుంటున్నారు. ఇవన్నీ ఎంత నిజమో ట్రేడ్ వర్గాలు చెప్పాలి.
అయితే విపరీతమైన నెగిటివ్ టాక్ లోనూ గుంటూరు కారం సినిమా ఈ మాత్రం కలెక్షన్స్ సాధించడం కూడా గొప్ప విషయమే. పండుగకు వచ్చిన హాలీడేస్ ఎఫెక్ట్ ఇదంతా అనుకోవచ్చు. స్టార్ హీరోల భారీ సినిమాలు కూడా కొంచెం తేడా టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ సీజన్ అడ్వాంటేజ్ మహేశ్ సినిమాకు బాగా కలిసివచ్చింది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ అయ్యిందని అనుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి వచ్చే వసూళ్లు లాభాల కిందకు వస్తాయి.