సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ యూఎస్ లో రిలీజ్ కు ముందే ఓ రికార్డ్ ను సొంతం చేసుకుంది. అత్యధిక ప్రీమియర్స్ పడుతున్న సినిమాగా గుంటూరు కారం యూఎస్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. త్రివిక్రమ్, మహేశ్ కాంబో మూవీ కాబట్టి గుంటూరు కారం మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
ఈ క్రేజ్ తోనే యూఎస్ లో 5 వేలకు పైగా ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో మరే తెలుగు సినిమాకు ప్రీమియర్స్ వేయలేదని గుంటూరు కారం టీమ్ చెబుతున్నారు. ఈ నెల 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.