మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం మహేశ్ బాబు వన్ మ్యాన్ షో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ పెద్దింటి కొడుకు కథ ఇది. తల్లికి ఆ కొడుకుకు మధ్య జరిగిన గతమేంటే..ఆ కొడుకు తిరిగి వస్తే తల్లి ఎలా స్పందించింది అనేది కథగా ఉండనుంది. ఈ కథలో మిర్చీ యార్డ్, ఆ మిర్చీ యార్డ్ ను దోచుకునే అక్రమార్కులు, వాటిని ఎదిరించేందుకు వచ్చిన గుంటూరు కారం లాంటి కుర్రాడు..ఇదే ట్రైలర్ ద్వారా రివీల్ అయిన స్టోరీ లైన. హీరోయిజం ఎలివేషన్స్, మ్యానరిజమ్స్ అదిరిపోయాయి.
పక్కా మహేశ్ స్టార్ డమ్ ను రీచ్ అయ్యేలా ట్రైలర్ లో షాట్స్ కనిపించాయి. ఇక శ్రీలీలతో మహేశ్ సీన్స్…అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డేను గుర్తుకు తెచ్చాయి. ఇందుకే పూజాను ఈ సినిమా నుంచి తప్పించారని అనుకోవచ్చు. ట్రైలర్ మొత్తం యాక్షన్ తో నింపి..చివరలో మదర్ సెంటిమెంట్ తో ఎండ్ చేశారు. హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థలో దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.