మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం వాయిదా పడటంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనేది సందిగ్ధంలో పడింది. అయితే ఇవాళే ట్రైలర్ రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. భద్రతా కారణాలతో పోలీసులు ఈ ఫంక్షన్ కు పర్మిషన్ ఇవ్వలేదు.
హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థలో దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమా మరో ఐదు రోజుల్లో స్క్రీన్స్ మీదకు వస్తోంది. మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ కాబట్టి ఈ సినిమా మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సంక్రాంతి రేసులో ముందున్న గుంటూరు కారం సినిమా యూఎస్ ప్రీమియర్స్ లో రికార్డ్ బుకింగ్స్ తెచ్చుకుంటోంది.