సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ రీసెంట్ సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో తెలియజేశారు. గుంటూరు కారం సినిమాలో ఫస్టాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుందని, సినిమా చివరి 45 నిమిషాలు గూస్ బంప్స్ తెప్పిస్తుందని నిర్మాత నాగవంశీ తెలిపారు. నిర్మాత చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి.
హారిక హాసినీ క్రియేషన్స్ లో త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నారు. గుంటూరు కారం మూవీకి సంబంధించిన వర్క్స్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తున్నారు మూవీ టీమ్. మరో 9 రోజుల్లోనే గుంటూరు కారం సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.