సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌత్ ఇండియన్ మూవీస్ లో 24 గంటల్లో ఇన్ని భారీ వ్యూస్ సాధించిన ట్రైలర్ ఇదేనంటూ మూవీ టీమ్ చెబుతోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోందీ ట్రైలర్. గుంటూరు కారం సినిమా మీదున్న క్రేజ్ ను ఈ ట్రైలర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో అంచనా వేయొచ్చు.
ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ థియేట్రికల్ రిలీజ్ గా గుంటూరు కారం ఉండబోతోంది. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ కెరీర్ లో గుంటూరు కారం ఒక స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.