తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యింది. 5 మిలియన్ డాలర్ వసూళ్లు మార్క్ కు చేరుకున్న ఈ సినిమా అక్కడ ఈ ఫీట్ సాధించిన 5 సినిమాల్లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటిదాకా 5 మిలియన్ వసూళ్లను తెలుగు నుంచి కేవలం ఐదు సినిమాలే అందుకున్నాయి. ఆ లిస్టులో హనుమాన్ జాయిన్ అయ్యింది. ఈ రేర్ ఫీట్ ను మూవీ ప్రొడక్షన్ హౌస్ సెలబ్రేట్ చేసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తమ హ్యాపీనెస్ షేర్ చేసింది.
15 రోజుల్లో 250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన హనుమాన్ మూడో వారంలోకి కాన్ఫిడెంట్ గా అడుగుపెట్టింది. థర్డ్ వీక్ కలెక్షన్స్ మీద ఈ సినిమా సాధించబోయే మరిన్ని రికార్డులు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఇక యూఎస్ లో 5 మిలియన్ క్రాస్ అయి 6 మిలియన్ వైపు కలెక్షన్స్ రన్ అవుతున్నాయి. హనుమాన్ సాధించిన బాక్సాఫీస్ సక్సెస్ టాలీవుడ్ చిన్న సినిమాలకు ఇన్స్ పైరింగ్ గా మారింది.