విషయం లేని సినిమాకు ఎంత పబ్లిసిటీ చేసినా అది మార్నింగ్ షోస్ ఫిల్ చేయడం వరకే పనికొస్తుంది. అదే సత్తా ఉన్న సినిమాకు చేసే ప్రమోషన్ ఆ సినిమాను మరింత ఆడియెన్స్ కు రీచ్ చేస్తుంది. హనుమాన్ విషయంలో ఇదే జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వచ్చిన హైప్ కు థియేటర్స్ లో వస్తున్న మౌత్ టాక్ తోడు కావడంతో ఈ సినిమా జెన్యూన్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది.
హనుమాన్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా రెస్పాన్స్ బాగుంది. యూఎస్ లో ఇప్పటికే 800కె దాటి వన్ మిలియన్ మార్కు కు చేరుకుంటోంది హనుమాన్. తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమా మన సూపర్ మ్యాన్ మూవీగా ప్రేక్షకాదరణ పొందుతోంది. మరోవైపు మహేశ్ గుంటూరు కారంకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ హనుమాన్ కు షిప్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.