తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ బాక్సాఫీస్ పరుగు అలుపులేకుండా సాగుతోంది. ఈ సినిమా రిలీజై వారం రోజులు అవుతోంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో దక్కాయి. హనుమాన్ వారం రోజుల్లో 150 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేందుకు రెడీ అవుతోంది. హనుమాన్ కు మరో వారం పది రోజుల లాంగ్ రన్ ఢోకా లేదని అంటున్నారు.
ఇలా చూస్తే పది హేను ఇరవై రోజుల్లో ఈ సినిమా సాధించే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా 4 మిలియన్ మార్క్ కు రీచ్ అవుతోందీ సినిమా. ఒక చిన్న సినిమా ఈ స్థాయి విజయం సాధించడం, సంక్రాంతికి రిలీజైన ఇతర స్టార్స్ సినిమాలేవీ దగ్గరకు కూడా రాలేని కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యపరిచే విషయమే.