టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ హనుమాన్. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించారు. మన సూపర్ హీరో సినిమాగా పాన్ ఇండియా సక్సెస్ సాధించిన హనుమాన్ చిన్న సినిమా మేకర్స్ కు ఎంతో ఇన్సిపిరేషన్ ఇస్తోంది. వరల్డ్ వైడ్ గా 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా గురించి మరో అప్డేట్ తెలుస్తోంది.
హనుమాన్ మూవీని త్వరలో త్రీడీ వెర్షన్ లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సమ్మర్ కల్లా త్రీడీలో హనుమాన్ ను రిలీజ్ చేయబోతున్నారట. ఫ్యామిలీ ఆడియెన్స్, చిల్డ్రన్స్ కు త్రీడీలో సినిమాలు చూడటం ఇష్టం. వేసవి సెలవుల్లో వీరిని సినిమా థియేటర్స్ కు రప్పించగలమని మేకర్స్ ఆశిస్తున్నారు.
మరోవైపు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ వర్క్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాలో హనుమంతుడు ప్రధాన పాత్రగా ఉండబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోలను అప్రోచ్ అవుతున్నారట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తారని తెలుస్తోంది.