దర్శకుడు హరీశ్ శంకర్ నిజంగా అదృష్టవంతుడే. ఆయన కెరీర్ లో చేసిన హిట్ సినిమా ఒక్కటంటే ఒక్కటే. అదే గబ్బర్ సింగ్. ఇది రీమేక్..పైగా పవన్ చెప్పిన సూచనలు ఎన్నో అని హరీశే చెప్పాడు. ఆ లెక్కన గబ్బర్ సింగ్ సక్సెస్ ను కూడా పూర్తిగా హరీశ్ శంకర్ ప్రతిభ అని చెప్పేందుకూ లేదు. అయినా గబ్బర్ సింగ్ పేరుతో ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్..ఇలా మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు మిగిలింది మెగాస్టార్ ఒక్కడే. ఆయనతోనూ సినిమా చేసే అవకాశం దక్కించుకుంటున్నాడట ఈ లక్కీ డైరెక్టర్.
కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి ఓ సినిమా చేయాల్సిఉంది. ఈ సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో చిరు కుమార్తె సుస్మిత నిర్మించాలనుకుంది. అయితే ఈ మూవీకి డైరెక్టర్ ను మార్చేశారు. ప్రాజెక్ట్ కూడా హోల్ట్ లో పడింది. ఇప్పుడీ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ హరీశ్ శంకర్ కు దక్కినట్లు తెలుస్తోంది. హరీశ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ కంప్లీట్ చేయగానే ఈ సినిమా పనులే మొదలుపెట్టనున్నాడట. ఏది ఏమైనా హరీశ్ లక్కీ డైరెక్టర్.