పరువంతా మీడియా తీసేసింది: నటి హేమ
ఇండస్ట్రీలో ఉండి కాపాడుకున్న నా 35 ఏళ్ల పరువంతా మీడియావాళ్లు భూస్థాపితం చేసేశారంటూ నటి హేమ ఓ వీడియో రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం బెంగలూరు రేవ్‌పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన నటి హేమ సోషల్ మీడియా వేదికగా ఇప్పుడొక వీడియో విడుదల చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారామె. అందుకు సంబంధించి అన్ని టెస్ట్‌లు చేయించుకున్నానని వెల్లడించారు.
చదవండి: ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేస్తే అదే వాళ్లకి చివరి రోజు..?
రేవంత్, పవన్ అపాయింట్‌మెంట్ కావాలి..?
అరెస్ట్ అనంతరం నాకు అన్ని టెస్ట్‌లు జరిగాయి. గోళ్లు, జుట్టు, బ్లడ్ అన్నింటితో టెస్టులు చేశారు. వీటన్నింటిలో నాకు నెగిటివ్ రిపోర్ట్సే వచ్చాయి. ఆల్రెడీ చాలా ఛానల్స్‌కు వెళ్లిమరీ చెప్పడం జరిగింది. ఇప్పుడీ వీడియో పోస్ట్ చేయడానికి కారణం లేకపోలేదు, నేను ఇప్పటికీ ఎలాంటి టెస్ట్‌లకు అయినా రెడీ అని చెప్తున్నా….నేను తప్పు చేయకపోయినా నింద మోసాను…నా పరువంతా బజారు కీడ్చేశారు…నా బాధ అంతా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గారికి, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారికి చెప్పుకోవాలనుకుంటున్నా…దయఉంచి వారు అపాయింట్‌మెంట్ ఇస్తారని ఈ వీడియో ద్వారా వేడుకుంటున్నానని నటి హేమ ఒకింత భావోద్వేగంతో కూడిన వీడియో పోస్ట్ చేశారు.