భారీ పాన్ ఇండియా లైనప్ చేయడమే కాదు వాటిని త్వరగా ఫినిష్ చేయడం కూడా ప్రభాస్ కు తెలుసు. ప్రభాస్ పని లేనప్పుడు లేజీగా ఉంటాడని, పని ఉంటే మాత్రం ఎంత కష్టమైనా చేస్తాడని రాజమౌళి లాంటి డైరెక్టర్స్ చెబుతుంటారు. ఇలాగే తన కొత్త సినిమా ది రాజా సాబ్ ఫినిష్ చేసే పనిలో పడ్డారు రెబెల్ స్టార్ ప్రభాస్. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో జరుగుతోంది.
ఈ సినిమా తాజా షెడ్యూల్ లో తన పార్ట్ ను ప్రభాస్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేసి ఇతర నటీనటులతో సీన్స్ తెరకెక్కిస్తున్నారట. ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నందున ఆయన షూటింగ్ వరకు త్వరగా కంప్లీట్ చేస్తున్నారు దర్శకుడు మారుతి. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే షెడ్యూల్ డిజైన్ చేశారు మారుతి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీ కాబోతోంది. హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుండటమే ఈ స్పెషాలిటీకి కారణం. ప్రభాస్ ఇప్పటిదాకా ఇలాంటి జానర్ లో నటించలేదు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజా సాబ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.