ఓ గట్టి సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలోనే “క” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ రోజు కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా “క” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కృష్ణగిరి అనే అందమైన అటవీ ప్రాంతంలోని ఊరు నేపథ్యంగా “క” సినిమా చేసినట్లు టీజర్ తో తెలుస్తోంది.
ఊరికి పోస్ట్ మేన్ గా పనిచేసే కిరణ్ అబ్బవరం కొన్ని ఉత్తరాలు చింపి చదువుతుంటాడు. అతనిలో కనిపించే మంచివాడితో పాటు కనిపించని వైలెంట్ పర్సన్ కూడా ఉన్నాడు. ఈ వైలెంట్ పర్సన్ లక్ష్యమేంటి అనేది “క” టీజర్ లో ఆసక్తిని రేపుతోంది. కిరణ్ అబ్బవరం మేకోవర్ కొత్తగా ఉంది. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి.
“క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ రూపొందిస్తున్నారు. “క” సినిమా త్వరలో “క” సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.