ఇటీవల సినిమాల నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్టార్ హీరోలు చేయాల్సిన సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకు సక్సెస్ కలిసి రాలేదు. దాంతో కంటెంట్ నే నమ్ముకోవాలని ఫిక్స్ అయ్యి స్టోరీ డ్రివెన్ మూవీస్ లైనప్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన హింట్ ఈరోజు ఇచ్చారు కిరణ్ అబ్బవరం. పోస్ట్ కార్డ్ పై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎల్లుండి ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో భాగమవుతోంది. విడుదలకు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు.