తెలుగు తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియర్ నటీనటులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ‘జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ… నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒకప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో కలిసి నటించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. త్వరలోనే మా సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
చదవండి: ‘విరాజి’ ఎవ్వరినీ నిరాశపర్చదు – నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల
30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ… నేను, అలాగే కృష్ణ సాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. సమాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ సాయి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గతంలోనే కృష్ణసాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులతో పాటు అద్భుతంగా నటించాడు. నా రోల్ కూడా బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. అన్నారు.